ENGLISH

రియాకీ.. రానాకీ సంబంధం ఏమిటి?

13 August 2020-14:00 PM

రియా చక్ర‌వ‌ర్తి.... ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌... రియా ఉంద‌ని సుశాంత్ అభిమానులు, స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. సీబీఐ కూడా రియాపై గురి పెట్టింది. రియాని ప‌లు ద‌ఫాలుగా విచారిస్తోంది. రియా బ్యాంకు ఎకౌంట్లు, ఫోన్ కాల్స్ డేటా.. ఇవ‌న్నీ ఇప్పుడు సీబీఐ చేతిలో ఉన్నాయి.

రియాకి ఎవ‌రెవ‌రి నుంచి ఫోన్లు వెళ్లాయి? రియా ఎవ‌రెవ‌రికి ఫోన్లు చేసింది? అనే విష‌యాన్ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రియాకి కాల్ చేసిన‌వాళ్ల‌లో రానా, ర‌కుల్ ప్రీత్ సింగ్ లు కూడా ఉన్నార‌ని కాల్ లిస్ట్ చెప్పేస్తోంది. రానాకు రియా ఏడుసార్లు ఫోన్ చేస్తే.. తిరిగి రానా నాలుగు సార్లు రియాకి కాల్ ఛేశాడ‌ట‌. ర‌కుల్ కి ఏకంగా 30 సార్లు కాల్ చేసింది రియా. ర‌కుల్ తిరిగి 14 సార్లు కాల్ చేసి మాట్లాడింది. ఈ జాబితాలో అమీర్ ఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్‌, మ‌హేష్ భ‌ట్ ల‌కు కూడా రియా ప‌లుమార్లు ఫోన్ చేసింది. దాంతో సీబీఐ వీళ్ల‌ని కూడా పిలిచి విచారిస్తుందా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. వీళ్ల మ‌ధ్య సంభాష‌ణ‌లు ఏర‌కంగా సాగాయి? అందులో సుశాంత్ ప్ర‌స్తావ‌న ఏమైనా ఉందా?  అనేది తెలిస్తే.. కేసు చిక్కుముడి వీడే అవ‌కాశం వుంది.

ALSO READ: బాలయ్యకు ఆ విలన్ ను సెట్ చేసిన బోయపాటి