ENGLISH

రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్‌

08 September 2020-15:30 PM

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర‌వాత‌.. అంద‌రి వేళ్లూ రియా చ‌క్ర‌వ‌ర్తి వైపు చూపించాయి. రియా వైఖ‌రి, ఆమె వ్య‌వ‌హారం ఇవ‌న్నీ అనుమానాల‌కు తావిచ్చాయి. దానికి త‌గ్గ‌ట్టు సీబీఐ కూడా రియాపై దృష్టి పెట్టింది. ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రియాని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

 

తాను కేవ‌లం సుశాంత్ కోస‌మే డ్ర‌గ్స్ కొనుగోలు చేశాన‌ని, వాటిని వినియోగించ‌లేద‌ని రియా చెబుతోంది. అయితే ఇందులో ఏమేర‌కు నిజం ఉంద‌న్న విష‌యాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచార‌ణ‌లో రియా మ‌రో 25మంది బాలీవుడ్ సెల‌బ్రెటీల పేర్లు బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది. వారంద‌రినీ విచారంచ‌డానికి ఎన్‌సీబీ రంగం సిద్ధం చేస్తోంది.

ALSO READ: మల్టీస్టారర్‌ కోసం మహేష్‌ మెగా ప్లానింగ్‌.