ENGLISH

ఆర్ఆర్ఆర్ టీమ్ మీట్ : ఏపీలో టికెట్ల ధరపై రియాక్షన్

11 December 2021-12:30 PM

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక సినిమా విశేషాలతో పాటు ఏపీలో టికెట్లు అంశం కూడా తరపైకి వచ్చింది.ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత రియాక్ట్ అయ్యారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఈ అంశం కొలిక్కి వస్తుందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదని చెప్పుకొచ్చారు

 

రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరి స్టార్లుని ఎలా బ్యాలన్స్ చేశారనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ.. నాకు స్టార్ వాల్యు బాగా తెలుసు. స్టార్ వాల్యుతోనే ఈ స్థాయిలోకి వచ్చాను. అయితే స్టార్స్ ఆడియన్స్ ని థియేటర్ లోకి మాత్రమే తీసుకురాగలరు. రామ్ చరణ్, తారక్ .. ప్రేక్షకులని థియేటర్ వరకూ తీసుకురాగలరు. సినిమా మొదలైన తర్వాత తెరపై వారిద్దరూ రెండు పాత్రలు. ఆ పాత్రలు పండితేనే సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుడి పాత్రనే కనెక్ట్ అవుతాడు తప్పితే స్టార్ తో కాదుని నేను నమ్ముతాను.ఈ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు కనిపిస్తాయి తప్పితే చరణ్ ఎన్టీఆర్ కాదనిని చెప్పుకొచ్చారు.

 

ఎన్టీఆర్, చరణ్ మాట్లాడుతూ.. రాజమౌళితో మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం మా ఇద్దరికీ గొప్ప ఆనందం ఇచ్చింది. తెరపై చరణ్ , ఎన్టీఆర్ కాకుండా రెండు పాత్రలు కనిపిస్తాయి. వారి మధ్య స్నేహం కనిపిస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చెప్తే వినాలని ఆశగా ఎదురుచూస్తున్నాం'' అనిచెప్పుకొచ్చారు.

ALSO READ: 'గమనం' మూవీ రివ్యూ & రేటింగ్!