ENGLISH

ఆర్‌.ఆర్‌.ఆర్‌.... త‌మిళ రేటు అదుర్స్‌!

17 February 2021-15:00 PM

రాజ‌మౌళి సినిమా అంటేనే హాట్ కేక్‌. కొబ్బ‌రి కాయ కొట్ట‌క ముందే బిజినెస్ మొద‌లైపోతుంది. ఆయ‌న‌కున్న స్టామినా అలాంటిది. బాహుబ‌లి త‌ర‌వాత‌... అందులోనూ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడంటే దానికున్న క్రేజ్ కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. దానికి త‌గ్గ‌ట్టే... `ఆర్‌.ఆర్‌.ఆర్‌` బిజినెస్ మ‌హా జోరుగా సాగుతోంది. తాజాగా త‌మిళ హ‌క్కుల్ని... నిర్మాత‌లు అమ్మేశారు. ఏకంగా 45 కోట్ల‌కు.

 

లైకా సంస్థ ఆర్‌.ఆర్‌.ఆర్ త‌మిళ హ‌క్కుల్ని 45 కోట్లకు సొంతం చేసుకుంది. త‌మిళ నాడు నుంచి ఇంత పెద్ద మొత్తం వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం కూడా అనుకోలేదు. కాక‌పోతే.. లైకా సంస్థ‌... ఈ సినిమాకుండే క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని, ఫ్యాన్సీ రేటుకే సొంతం చేసుకుంది. ఓ తెలుగు సినిమా త‌మిళ నాట ఇంత ధ‌ర ప‌ల‌క‌డం ఇదే రికార్డు. రాజ‌మౌళి సినిమానా? మ‌జాకా?? రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌థానాయ‌కులుగా న‌టించిన ఈ చిత్రంలో అలియాభ‌ట్ క‌థానాయిక‌. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ కీల‌క పాత్ర‌లు పోషించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌రు 13న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ALSO READ: ఆ ద‌ర్శ‌కుడ్ని వ‌ద‌ల‌నంటున్న మైత్రీ