ENGLISH

RRR పై స‌మ‌ర శంఖం పూరించిన భీమ్లా

16 November 2021-12:18 PM

ఈ సంక్రాంతి స‌మ‌రం మ‌హా రంజుగా సాగ‌బోతోంది. RRR రాక‌తో.. మిగిలిన సంక్రాంతి రిలీజ్ పై ఒత్తిడి పెరిగింది. సంక్రాంతికి వ‌ద్దామ‌నుకున్న కొన్ని సినిమాలు డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా స‌ర్కారు వారి పాట‌.. వెన‌క్కి త‌గ్గింది. భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే... భీమ్లా ఇప్పుడు రివ‌ర్స్‌గేర్ వేసింది. RRR పై స‌మ‌ర శంఖం పూరించింది. త‌మ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈరోజు భీమ్లా నాయ‌క్ కి సంబంధించిన కొత్త పోస్ట‌ర్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయ‌క్ విడుద‌ల అవుతుంద‌ని ఈ పోస్ట‌ర్ ద్వారా చిత్ర‌బృందం స్ప‌ష్టం చేసింది. RRR జ‌న‌వ‌రి 7న విడుద‌ల అవుతుంది. జ‌న‌వ‌రి 14న రాధే శ్యామ్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య భీమ్లా నాయ‌క్ దిగ‌బోతున్నాడు. అంటే.. వారం రోజుల వ్య‌వ‌ధిలో 3 పెద్ద సినిమాలు చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. అయితే.. ఈ పోటీ ఇక్క‌డితో ఆగ‌డం లేదు. నాగార్జున `బంగార్రాజు` కూడా సంక్రాంతికే వ‌ద్దామ‌ని ఫిక్స్ అయ్యాడు. అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అది కూడా వ‌చ్చేస్తే.. ఈ సంక్రాంతి పోటీ మ‌రింత తీవ్ర‌మైన‌ట్టే.

ALSO READ: శ్యామ్ Vs గ‌ని... పోటీ మామూలుగా ఉండ‌దిక‌