ENGLISH

సాయిపల్లవిపై గాలి వార్తలు మళ్లీ మొదలయ్యాయ్‌!

02 May 2019-18:30 PM

మోస్ట్‌ టాలెంటెడ్‌ బ్యూటీగా సాయి పల్లవి ఎంత మంచి పేరు తెచ్చుకుందో, ఆటిట్యూడ్‌ విషయంలో మాత్రం అంత చెడ్డ పేరు వెంట తెచ్చుకుంది. తొలి సినిమాతో ఏదో అలా జరిగిపోయింది. కానీ 'కణం' సినిమా విషయంలో హీరో నాగశౌర్యతో వచ్చిన విబేధాలు అన్నీ ఇన్నీ కావు. ఓపెన్‌గానే నాగశౌర్య, సాయిపల్లవిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నానితో నటించిన 'ఎం.సీ.ఏ' టైంలోనూ ఆమెపై బోలెడన్ని రూమర్లు చక్కర్లు కొట్టాయి.

 

ఇకపోతే తాజాగా మరోసారి సాయిపల్లవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో 'విరాటపర్వం' సినిమాలో రానాకి జోడీగా నటించాల్సి ఉంది. సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నక్సలిజం బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతోంది. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ, అప్పుడే సాయిపల్లవిపై గాలి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. ఈ వార్తల్లో నిజమూ లేకపోలేదు. అసలింతకీ న్యూస్‌ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంటానని సాయిపల్లవి నిర్మాతల్ని హెచ్చరిస్తోందట.

 

ఈ టాక్‌ నిజమా కాదా? అనే విషయం పక్కన పెడితే, సినిమా సినిమాకి సాయిపల్లవిపై ఈ రూమర్లు, ఆమె కెరీర్‌కి ఎంతో కొంత డ్యామేజీ కాకుండా పోవు. అయినా లిమిటెడ్‌గా సినిమాలు చేసే సాయి పల్లవిపై ఎందుకో ఈ రూమర్లు? ప్రతీ గాసిప్‌కీ రెస్పాండ్‌ అవ్వాలంటే అన్ని సమయాల్లోనూ కుదరదు కూడా. ఏమో ఈ తాజా గాసిప్‌కి మలర్‌ బ్యూటీ ఎలా రెస్పాండ్‌ అవుతుందో ఏమో కానీ, ఇదిలా ఉంటే, సాయిపల్లవి నటించిన తమిళ చిత్రం 'ఎన్.జి.కె' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు సాయిపల్లవి చేతిలో ఉన్నాయి.

ALSO READ: WHY SAI PALLAVI REJECTED A 2 CR ADVERTISEMENT?