ENGLISH

సాయిధ‌ర‌మ్ పెళ్లి కుదిరిందా?

23 August 2020-10:16 AM

లాక్ డౌన్ సీజ‌న్ కాస్త‌.. టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజ‌న్ గా మారిపోయింది. నితిన్‌, నిఖిల్‌, రానా.. వీళ్లంతా పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఆ బాట‌లోనే వెళ్తున్నాడా? అనిపిస్తోంది.

 

ఈ రోజు ట్విట్ట‌ర్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో పోస్ట్ చేశాడు తేజూ. ఇందులో బ్యాచిల‌ర్ హీరోలంద‌రూ క‌లిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఇలా ఒక్కొక్క‌రు లెఫ్ట్ అయ్యారు. చివ‌ర్లో "ప్ర‌భాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వ‌చ్చిందం"టూ సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. . "ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌దు మ‌రి... అంటూ ఆ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేశాడు.

 

 

అయితే ఈ విష‌యం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రేపు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే... సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు దీనికి సంబంధించిన పూర్తి డిటైల్స్ ని ట్విట్ట‌ర్ లో ఉంచుతాన‌న్నాడు తేజూ.

ALSO READ: అద‌ర‌హో.... 'ఆచార్య‌'