ENGLISH

ఎన్టీఆర్ డీఎన్ఏ.. కమల్ హసన్ డీఎన్ఏ కలిస్తే..

07 January 2023-16:04 PM

బాలకృష్ణ సినిమా అనగానే అందరికీ పూనకం వచ్చేస్తుంది. ఆయన వేడుకల్లో మాటలు కూడా వేరే లెవెల్ లో వుంటాయి. వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే తరహా పవర్ ఫుల్ స్పీచులు వినిపించాయి. ముఖ్యంగా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఓక్ వెరైటీ స్పీచు ఇచ్చారు. ఎన్టీఆర్ , కమల్ హాసన్ డీఎన్ఏ అంటూ ఒక పోలిక తెచ్చారు.

 

''నటసింహం వీర సింహమై గర్జిస్తే ఎలా వుంటుందో వీరసింహారెడ్డి సినిమా అలా వుంటుంది. ప్రపంచంలోని బాలకృష్ణ అభిమానాలంతా మీసం తిప్పి కాలర్ ఎగరేసుకునేలా వుంటుంది. ఇందులో అనుమానం లేదు. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ. కమల్ హాసన్ గారిలో వుండే కామెడీ టైమింగ్ శ్రుతి హాసన్ గారిలో వుంది. వీరసింహారెడ్డి లో ప్రేక్షకులు అది ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ రామారావు గారి డీఎన్ఎ కమల్ హసన్ గారి డీఎన్ఎ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎంత అద్భుతంగా వుంటుందో వీరసింహారెడ్డిలో చూస్తారు.'' అంటూ ఊగిపోయారు సాయి మాధవ్ బుర్రా.