ENGLISH

లిప్ లాక్ నుంచి అలా త‌ప్పించుకుంది

15 December 2020-16:00 PM

ఈరోజుల్లో లిప్ లాక్, బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఎంత‌టి హీరోయిన్ అయినా... వీటితో స‌ర్దుకుపోవాల్సిందే. అయితే కొంత‌మంది మాత్రం `ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌ను` అని ఖ‌రాఖండీగా చెప్పేస్తారు. సాయి ప‌ల్ల‌వి అదే టైపు. లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం త‌న‌కు ఏమాత్రం ఇష్టం ఉండ‌దు. అయితే ఓ సంద‌ర్భంలో మాత్రం లిప్ లాక్ స‌న్నివేశంలో న‌టించాల్సిందే అని ద‌ర్శ‌కుడు ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌.

 

అయితే సాయి ప‌ల్ల‌వి లొంగ‌లేద‌ట‌. `నేను ఇలాంటి సీన్లు చేయ‌ను.. కావాలంటే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటా` అని తెగేసి చెప్పింద‌ట‌. అప్ప‌టికే సాయి ప‌ల్ల‌విపై కొన్ని స‌న్నివేశాల్ని చిత్రీక‌రించి ఉండ‌డంతో.. నిర్మాత భ‌య‌ప‌డ్డాడ‌ట‌. పైగా ఆ సినిమాలో న‌టించే హీరో కూడా సాయి ప‌ల్ల‌వివైపే నిల‌బ‌డ్డాడ‌ట‌. `త‌న‌కు ఇష్టం లేన‌ప్పుడు బ‌ల‌వంతం చేయ‌కు. మ‌రీ శ్రుతిమించితే అంద‌రిలానే నువ్వు కూడా మీటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది `అని ప‌రోక్షంగా బెదిరించ‌డాట‌. దాంతో.. ఆ ద‌ర్శ‌కుడు కాస్త వెన‌క‌డుగు వేసి, లిప్ లాక్ సీన్ ఆ సినిమాలోంచి తొల‌గించాడ‌ట‌. ఈ విష‌యాన్ని సాయి ప‌ల్ల‌వే స్వ‌యంగా వెల్ల‌డించింది. హీరోయిన్లంతా ఇలా ధైర్యంగా ఉంటే, ఎంత బాగుంటుందో క‌దూ.

ALSO READ: ర‌వితేజ‌కు భ‌లే ఛాన్సులే!