ENGLISH

న‌న్న‌లా చూడొద్దు.. ప్లీజ్‌!

23 March 2021-15:00 PM

టాలీవుడ్లో దుమ్ము రేపు డాన్స‌ర్లు చాలామంది ఉన్నారు. ప్ర‌తీ హీరోకీ.. డాన్స్‌లో త‌మ‌దంటూ ఓ మార్క్ వుంది. అయితే హీరోయిన్లూ అందుకు తీసిపోరు. త‌మ‌న్నా డాన్సుల్లో మేటి. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి సైతం మేటి డాన్స‌ర్ అనిపించుకుంటోంది.రౌడీ బేబీలో సాయి ప‌ల్ల‌వి వేసిన స్టెప్పులు.. సంచ‌ల‌నం రేపాయి. ఈత‌రంలో త‌నే గొప్ప డాన్స‌ర్ అనే ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టాయి. అయితే ఇలాంటి గుర్తింపు త‌న‌కు వ‌ద్దు అంటోంది సాయి ప‌ల్ల‌వి. మంచి న‌టిగా వ‌చ్చిన గుర్తింపు కంటే.. మిగిలిన‌వ‌న్నీ చిన్న‌విగానే క‌నిపిస్తాయ‌ని, డాన్స్ బాగుందంటే అది త‌నొక్క‌దాని ప్ర‌తిభ కాద‌ని, దాని చుట్టూ చాలామంది క‌ష్టం దాగుంద‌ని అంటోంది.

 

``డాన్స్ అంటే నేనొక్క‌దాన్నే కాదు. మంచి పాట కుద‌రాలి. సంద‌ర్భం కావాలి. డాన్స్ మాస్ట‌ర్ మంచి స్టెప్పులు వేయించాలి. ఇవ‌న్నీ క‌లిస్తేనే. న‌ట‌న అంటే.. అందులో నేను మాత్ర‌మే ఉంటా. అదే నా స్వార్థం`` అంది. తాను న‌టించిన `ల‌వ్ స్టోరీ` ఈ వేస‌విలోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలోని `సారంగ ద‌రియా` పాట‌కు కూడా అదిరిపోయే స్టెప్పులేసింద‌ట సాయి ప‌ల్ల‌వి. ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో ఈ పాట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. విడుద‌ల‌య్యాక ఇంకెంత‌టి సునామీ సృష్టిస్తుందో..?

ALSO READ: ప్ర‌భాస్ నుంచి మ‌రో పాన్ ఇండియా సినిమా