ENGLISH

పూరి త‌మ్ముడికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌

06 March 2021-09:11 AM

పూరి తమ్ముడు సాయిరామ్ శంక‌ర్‌. త‌న‌లో మంచి ఈజ్ ఉంది. కానీ.. హిట్లే లేవు. బంప‌ర్ ఆఫ‌ర్ తో ఓహిట్టు కొట్టినా.. దాన్ని కాపాడుకోలేక‌పోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ అదే టైటిల్ ని న‌మ్ముకున్నాడు. సాయి రామ్ శంక‌ర్ ఇప్పుడు ఓ కొత్త సినిమా చేస్తున్నాడు. దానికి `బంప‌ర్ ఆఫ‌ర్ 2` అనే పేరు పెట్టారు. బంప‌ర్ ఆఫ‌ర్ ని తెర‌కెక్కించిన జ‌య ర‌వీంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే ఇది బంప‌ర్ ఆఫ‌ర్ కి సీక్వెల్ కాద‌ట‌.

 

ఈసారి కొత్త క‌థ‌ని ఎంచుకున్నార్ట‌. ఉగాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. రాయ‌ల సీమ నేప‌థ్యంలో ఈ సిని‌మా న‌డుస్తుంద‌ని, పూర్తి వినోదాత్మ‌కంగా తీర్చిదిద్దుతున్నామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. క‌థానాయిక, ఇత‌ర సాంకేతిక నిపుణులు వివ‌రాలు తెలియాల్సివుంది.

ALSO READ: 'ఏ1 ఎక్స్ ప్రెస్' మూవీ రివ్యూ & రేటింగ్!