ENGLISH

Salaar: స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చింద‌హో!

15 August 2022-13:20 PM

స‌లార్‌... దేశ వ్యాప్తంగా ప్ర‌భాస్ అభిమానులు ఈ సినిమా గురించీ, ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ల గురించీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే చాలాసార్లు ఈ సినిమా రిలీజ్ డేట్లు అధికారికంగా ప్ర‌క‌టించేశారు. కానీ.. ఆ డేట్లు వాయిదా వేసుకుంటూనే వ‌చ్చారు. ఇప్పుడు మ‌రోసారి స‌లార్ రిలీజ్ డేట్ మ‌రోసారి ఫిక్స్ చేశారు. ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా - స‌లార్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌.

 

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2023 సెప్టెంబ‌రులో స‌లార్ 1 వ‌స్తే.. 2024 వేసవిలో స‌లార్ 2 విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అదే యేడాది ప్రాజెక్ట్ కె కూడా వస్తుంది. 2023లో ఆదిపురుష్ కూడా రెడీ అవుతోంది. అంటే.. 2023, 2024లో ప్ర‌భాస్ నుంచి రెండేసి సినిమాలు రాబోతున్నాయ‌న్న‌మాట‌. 2023 ఏప్రిల్ నాటికి పార్ట్ 1, పార్ట్ 2ల‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసేస్తారు. ఆ వెంట‌నే.. ప్ర‌భాస్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది.

ALSO READ: గీతా ఆర్ట్స్ చేతిలో బింబిసార ద‌ర్శ‌కుడు