ENGLISH

Salman Khan: చిరంజీవి కోసం స‌ల్మాన్ వ‌స్తాడా?

08 September 2022-13:36 PM

ఆచార్య‌తో చిరంజీవి పూర్తిగా డీలా ప‌డిపోయాడు. ఇప్పుడు ఎలాగైనా ఓ హిట్టు కొట్టి, త‌న అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చాల‌ని చూస్తున్నాడు చిరు. అక్టోబ‌రు 5న గాడ్ ఫాద‌ర్ వ‌స్తోంది. ఈ సినిమాపై చిరుకి న‌మ్మ‌కాలున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్ క‌థ‌. సో... క‌థ ప్రకారం త‌ప్పు చేయ‌దు. పైగా న‌య‌న‌తార‌, స‌ల్మాన్ ఖాన్‌, స‌త్య‌దేవ్ ఇలాంటి స్టార్ గ‌ణ‌మంతా ఉంది. కాబ‌ట్టి... మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ప్ర‌మోష‌న్ల‌కు కూడా స‌రిగా ప్లాన్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు.

 

ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న్ని రంగంలోకి దింపితే ప్ర‌మోష‌న్ల‌కు హైప్ వ‌స్తుంద‌ని చిరు ఆశ‌. అందుకే.. స‌ల్మాన్ ఖాన్ ని ఆహ్వానించాడ‌ట‌. స‌ల్మాన్ కోసం ముంబైలో ఓ ఈవెంట్ చేయ‌బోతోంది గాడ్ ఫాద‌ర్ బృందం. అలానే.. తెలుగులో కూడా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసి స‌ల్మాన్ ని తీసుకురావాల‌ని అనుకుంటోంది. అందుకు త‌గిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

 

స‌ల్మాన్ ఖాన్ కూడా `ప్ర‌మోష‌న్ల‌కువ‌స్తాను... ప్లాన్ చ చేసుకోండి` అని చిరుకి మాటిచ్చాడ‌ట‌. సో.. స‌ల్మాన్ రావ‌డం ఖాయం. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ `లూసీఫ‌ర్‌`కి రీమేక్ అనే సంగ‌తి తెలిసిందే.

ALSO READ: ఒకే వేదికపై చిరు-పవన్- సల్మాన్ !