ENGLISH

Salman, Puri: సల్మాన్ తో పూరి సినిమా ?

19 August 2022-17:03 PM

పూరి జగన్నాథ్ 'లైగర్' తో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా వున్న పూరి మరో బాలీవుడ్ సినిమా గురించి తన మనసులో మాట చెప్పారు. సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్ తన వద్ద ఉందని చెప్పాడు “వాంటెడ్‌ విడుదలైనప్పటి నుంచి సల్మాన్‌ సర్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను. సల్మాన్ అంటే ఇష్టం. ఏదో ఒక రోజు అతనికి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు పూరి అన్నారు.

 

'పోకిరి రీమేక్ అయిన 'వాంటెడ్' లో నటించాడు సల్మాన్, ఈ సినిమా కూడా బాలీవుడ్ లో విజయం సాధించింది. అలాగే పూరి టెంపర్ సినిమా కూడా సింబా గా బాలీవుడ్ లో విజయం సాధించింది, అలాగే పూరి అమితాబ్ తో ఓ సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. లైగర్ హిట్ ఐతే సల్మాన్ తో పూరి సినిమా చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

ALSO READ: విజయ్ పై నెగిటివ్ ప్రచారం.. మంచిదే !