ENGLISH

టెర్ర‌రిస్ట్ గా స‌మంత‌?

26 September 2020-18:00 PM

ఇప్పుడిప్పుడే... శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల వైపుగా అడుగులు వేస్తోంది స‌మంత‌. రంగ‌స్థ‌లం, ఓ బేబీ, యూట‌ర్న్‌, మ‌జ‌లీ చిత్రాలలో స‌మంత కొత్తగా క‌నిపించింది. ఇక ముందూ... అలాంటి పాత్ర‌ల‌నే ఎంచుకోబోతోంది. స‌మంత తొలిసారి గా ఓ వెబ్ సిరీస్ లోన‌టించిన సంగ‌తి తెలిసిందే.

 

`ది ఫ్యామిలీ మెన్` రెండో సీజ‌న్ లో స‌మంత ఓ కీల‌క పాత్ర చేసింది. ఈ పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టెర్ర‌రిజం నేప‌థ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. ఐఎస్ఐ ఉగ్ర‌వాదులు, వారి ప‌న్నాగాలూ, చేయ‌బోయే విధ్వంసాలు.. వీటు చుట్టూ క‌థ న‌డుస్తుంది. ఇందులో స‌మంత పాకిస్థాన్ కి చెందిన టెర్ర‌రిస్ట్ గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఆమె కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లోనూ పాల్గొంద‌ని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌మొత్తం స‌మంత సీరియ‌స్ లుక్ లోనే క‌నిపిస్తుంద‌ట‌.

 

ఇటీవ‌లే ఈ వెబ్ సిరీస్ ర‌షెష్ చూసుకున్న సమంత తీవ్ర భావోద్వేగానికి గురైంద‌ట‌. స‌మంత‌లోని మ‌రో కోణాన్ని ఈ పాత్ర వెలికి తీస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వెలిబుచ్చుతున్నారు వెబ్ సిరీస్ రూప‌క‌ర్త‌లు.

ALSO READ: Samantha Latest Photoshoot