ENGLISH

గ‌డుసు అభిమానికి... స‌మంత తెలివైన స‌మాధానం

06 November 2020-11:08 AM

సోష‌ల్ మీడియాలో ప్ల‌స్సులు ఎన్ని ఉన్నాయో... మైన‌స్సులూ అన్నే ఉన్నాయి. సినిమాల‌కు కావ‌ల్సినంత ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో ఫ్రీగా ల‌భిస్తోంది. అయితే... దానికి తోడుగా త‌ల‌నొప్పులూ ఉన్నాయి. అభిమానుల్లో ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలీదు. వాళ్ల‌కు స‌మాధానం చెప్ప‌డం అంత తేలిక కాదు. తాజాగా స‌మంత‌కు ఇలానే ఇన్‌స్టా గ్రామ్ లో ఓ చేదు ప్ర‌శ్న ఎదురైంది.

 

`చైకి విడాకులు ఇచ్చేయ్‌.. మ‌నం పెళ్లి చేసుకుందాం` అని స‌మంత ఇన్స్టా లో ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. నిజంగా ఇది.. స‌మంత హ‌ర్ట‌య్యే కామెంటే. దానికి స‌మంత దురుసుగా స‌మాధానం చెబుతుందేమో అని భావించారంతా. కానీ.. స‌మంత ఈ విష‌యంలో కాస్త తెలివిగా ఆలోచించింది. `క‌ష్టం.. ఒక ప‌నిచేయ్‌..చైని అడుగు` అని బంతికి చైత‌న్య కోర్టులో ప‌డేసింది. సాధార‌ణంగా ఇలాంటి ప్ర‌శ్న‌లు, కామెంట్లు సెల‌బ్రెటీల్ని ఒక‌ర‌క‌మైన విసుగుకి గురి చేస్తాయి. పైగా స‌మంత చాలా సెన్సిటీవ్‌. తాను వైల్డ్ గా రియాక్ట్ అవ్వ‌కుండా కూల్ గా స‌మాధానం చెప్పగ‌లిగింది.

ALSO READ: Samantha Latest Photoshoot