ENGLISH

చై - శామ్‌ 'గిల్లికజ్జాలు' మొదలైపోయాయ్‌.!

23 July 2018-12:59 PM

టాలీవుడ్‌ మోస్ట్‌ రొమాంటిక్‌ ప్రేమ జంట చై,శామ్‌ గతేడాది వివాహ బంధంతో భార్యా భర్తలైన సంగతి తెలిసిందే. వివాహానికి ముందు పలు చిత్రాల్లో నటించిన ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతంది. 'నిన్నుకోరి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రీల్‌ లైఫ్‌ దంపతులుగా చై,శామ్‌ నటిస్తున్నారు. 

పెళ్లి తర్వాత సాధారణంగా భార్యా భర్తల మధ్య చోటు చేసుకునే గిల్లికజ్జాలు, భావోద్వేగాలు, ఆప్యాయతానురాగాల చుట్టూ సాగే ఓ రొమాంటిక్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే కొన్ని ఊహించని థ్రిల్లింగ్‌ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారట. చాలా సహజంగా సాగే ఈ స్టోరీకి ఈ సస్పెన్స్‌, థ్రిల్లర్‌ అంశాలు ట్విస్టింగ్‌గా ఉండబోతున్నాయట. ఇలాంటి కాన్సెప్ట్‌ మూవీ ఇద్దరికీ కొత్తేనంటున్నారు చైతూ, శామ్‌. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సేనట. కానీ పెళ్లి తర్వాత తామెలాంటి చిత్రంలో నటించాలనుకున్నారో సరిగ్గా అదే స్టోరీ లైన్‌ కావడంతో, డైరెక్టర్‌ శివ చెప్పగానే వెంటనే ఓకే చేసేశారట. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం. 

ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఆగస్టు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి', శైలజారెడ్డి' అల్లుడు' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమంత 'యూ టర్న్‌' చిత్రంలో నటిస్తోంది. ఇదో జర్నీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీనే. సమంత జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ లేటెస్టుగా విడుదలైంది.
 

ALSO READ: బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయిన వారికి మరో ఛాన్స్