ENGLISH

స‌మంత ఛాన్స్ లాగేసుకొన్న శ్రుతి

26 January 2024-10:40 AM

స‌మంత కెరీర్ అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. ఓవైపు అనారోగ్య స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. మ‌రోవైపు చేతికి అందిన అవ‌కాశాలు చివ‌రి నిమిషంలో చేజారిపోతున్నాయి. కొన్ని అవ‌కాశాల్ని స‌మంత స్వ‌యంగా వ‌దులుకొంటే, ఇంకొన్ని ఇంకొక‌రు లాగేసుకొంటున్నారు. ఆ జాబితాలో మ‌రో సినిమా చేరింది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో చెన్నై స్టోరీ అనే చిత్రం తెర‌కెక్కాల్సివుంది. ఫిలిప్ జాన్ ద‌ర్శ‌కుడు. 'అరెంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్‌' అనే న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


అయితే ఈ సినిమా నుంచి స‌మంత త‌ప్పుకొంది. ఆ స్థానంలో శ్రుతిహాస‌న్ వ‌చ్చి చేరింది. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాని స‌మంత వ‌దులుకొందా, లేదంటే చిత్ర‌బృందమే స‌మంత‌ని త‌ప్పించి, శ్రుతిహాస‌న్‌ని తీసుకొందా అనేది తెలియాల్సివుంది. ఈ చిత్రంలో శ్రుతి డిటెక్టీవ్‌గా క‌నిపించ‌బోతోంది.


యేడాది కాలంగా శ్రుతికి బాగానే క‌లిసొస్తోంది. గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' మంచి విజ‌యాలు సాధించాయి. డిసెంబ‌రులో వ‌చ్చిన `స‌లార్‌` కూడా సూప‌ర్ హిట్ట‌య్యింది. దాంతో పాటు చేతినిండా బోలెడు సినిమాలున్నాయి. దాంతో పాటు ఈ సినిమా కూడా చేరింది. దాంతో శ్రుతి ఫుల్ ఖుషీ అయిపోతోంది.