ENGLISH

స‌మంత రూ. 50 కోట్లు దోచుకుందా? మ‌రి రిప్లై ఏమిటి?

22 December 2021-10:57 AM

సోష‌ల్ మీడియా వ‌ల్ల కొత్త రెక్క‌లొచ్చేశాయి. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ ల‌లో ఏదైనా స‌రే, ఎవ‌రినైనా స‌రే కామెంట్ చేసేయొచ్చు అనుకుంటున్నారు ఆక‌తాయిలు. స్టార్లు, సెల‌బ్రెటీల మ‌నోభావాల్ని దెబ్బ‌తీస్తూ... కొంత‌మంది దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే.. వీటినికొంత‌మంది ప‌ట్టించుకుంటున్నారు. మ‌రి కొంత‌మంది లైట్ తీసుకుంటున్నారు. కానీ మ‌రీ హ‌ద్దుమీరితే మాత్రం ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. స‌మంత కూడా అంతే. దేన్నీ చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం లేదు. స‌మాధానం ఇవ్వాల్సిన చోట ఏమాత్రం ఆలోచించ‌కుండా కౌంట‌ర్లు వేసేస్తోంది.

 

నాగ‌చైతన్య‌తో స‌మంత విడాకులు తీసుకున్న త‌ర‌వాత‌.. ఓ వ‌ర్గం స‌మంత‌ని కావాల‌ని టార్గెట్ చేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో స‌మంత‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజ‌న్‌. ‘సమంత.. విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్‌ ఐటెం. ఒక జెంటిల్మెన్‌ నుంచి అప్పనంగా రూ. 50 కోట్లు దోచుకుంది’ అంటూ ట్రోల్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన సమంత.. ‘నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆక‌తాయిని స‌రైన స‌మాధాన‌మే ఇచ్చావు అంటూ.. స‌మంత‌ని మెచ్చుకుంటున్నారు జ‌నాలు.

ALSO READ: Samantha Latest Photoshoot