ENGLISH

స‌మంత మ‌రో కీల‌క నిర్ణ‌యం... షాక్ లో చైతూ ఫ్యాన్స్‌

09 October 2021-14:00 PM

నాగ‌చైత‌న్య‌తో విడాకుల తంతు పూర్త‌య్యాక‌.. పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్ట‌బోతోంది స‌మంత‌. ఇప్ప‌టికే రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకుంద‌ని, ఇక త‌ర‌చూ సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు... ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం కూడా తీసుకుంద‌ట‌. స‌మంత‌కి `సాకీ` అనే బ్రాండింగ్ సంస్థ ఉంది. స‌మంత - అక్కినేనిలో తొలి అక్ష‌రాల్ని క‌లిపి - సాకీ అనే పేరుతో ఈ బ్రాండింగ్ ప్రారంభించింది. ఆ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది.

 

అయితే చైతో విడాకులు అయిపోయాయి క‌దా.. అందుకే `సాకీ` పేరుని మార్చాల‌ని చూస్తోంది. ఇప్పుడు స‌మంత కొత్త పేరు గురించి అన్వేషిస్తోంద‌ని టాక్‌. అలా. చైతో త‌న‌కున్న జ్ఞాప‌కాలు మొత్తం తుడిచేయాల‌ని స‌మంత భావిస్తోంది. `సాకీ` వెనుక‌... చై ఆలోచ‌న‌లు, పెట్టుబ‌డి కూడా ఉంది. చై ప్రోత్సాహంతోనే `సాకీ`ని ప్రారంభించిన‌ట్టు స‌మంత ఇది వ‌ర‌కు చెప్పింది. అయితే ఇప్పుడు త‌న జీవితంలో చై లేడు. అందుకే సాకీ నీ ప‌క్క‌న పెట్టేస్తోంది. ఈ బ్రాండ్ కి సమంత కొత్త పేరు పెట్ట‌బోతోంది. ఆ పేరేంట‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది.

ALSO READ: చీట‌ర్ ఎవ‌రో చెప్పేసిన సిద్దార్థ్‌