ENGLISH

సిద్ధిపేట జిల్లాలో సమంత హల్చల్

10 March 2017-18:30 PM

ఈ మధ్యనే సమంతని తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఆ పోస్ట్ ని సమంత బాగా సీరియస్ గా తీసుకునట్టుగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే, సమంతా  ఈ రోజు సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ప్రాంతంలోని చేనేత కార్మికులను అలాగే వారు పనిచేసే చోట్లలో పర్యటించారు.

ఈ ఆకస్మిక పర్యటన ఏంటి అని విలేకరులు ప్రశ్నించగా.. ఇది అధికారిక పర్యటన కాదని కేవలం వ్యక్తిగతం మాత్రమే తను ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చింది.

అయితే ఇది చూసిన వారు మాత్రం చాలా మంది సినీ తారల మాదిరిగా సమంత పేరుకి అంబాసిడర్ గా కాకుండా ఇలా చురుకుగా పనిచేస్తుండడం నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు ఈ అక్కినేని వారి కోడలిని.

 

ALSO READ: నగరం మూవీ రివ్యూ & రేటింగ్స్