సమీరా రెడ్డి... ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి...ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతే.. తొందరగా కనుమరుగైపోయింది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ఓ పాత ఫొటోని షేర్ చేసింది సమీరా. అందులో తను చాలా లావుగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? అంటూ అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటో వెనుక ఉన్న కథని కూడా సమీరా అభిమానులతో పంచుకుంది.
అప్పట్లో తాను చాలా లావుగా ఉండేదాన్నని, చాలామంది తనని సూటి పోటి మాటలతో బాధించేవాళ్లని, అలాంటివాటిని తట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ఆమాటల్ని తట్టుకోలేకే.. సన్నగా మారిందట. అలా.. మారడం వల్లే మోడలింగ్ లోకి అడుగుపెట్టగలిగానని అంటోంది. ``ఓ రకంగా నెగిటీవ్ కామెంట్లు కూడా మనకు మంచే చేస్తుంటాయి. దానికి నేనే పెద్ద ఉదాహరణ`` అని తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నించింది సమీరా.
ALSO READ: Sameera Reddy Latest Photoshoot