ENGLISH

కూతురికి మున్నాభాయ్ స్వీట్ వార్నింగ్

05 March 2017-11:53 AM

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ ఉద్ధేశ్యంలో నటన అంటే అంత ఆషామాషీ కాదంటున్నాడు. అందులోనూ అమ్మాయిలు నటనలో గుర్తింపు తెచ్చుకోవాలంటే అందుకు చాలా కష్టపడాలంటున్నాడు. హీరోగా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన సంజయ్‌ దత్‌ పర్సనల్‌ లైఫ్‌లో చాలా కష్ట నష్టాలు అనుభవించాడు. ఈ మధ్యే జైలు నుండి విడుదలై ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. జైలు నుండి వచ్చిన తర్వాత సంజయ్‌ దత్‌ చేస్తోన్న తొలి చిత్రం 'భూమి'. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ ఇంచుమించు తన కూతురు వయసున్న అదితి హైదర్‌కి తండ్రిగా నటిస్తున్నాడు. తండ్రీ, కూతుళ్ల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సంజయ్‌దత్‌ తన కూతురు త్రిషాలా గురించి మాట్లాడారు. ఆయనకి తన కూతురు హీరోయిన్‌ కావడం తనకిష్టం లేదని అన్నారు. ఆమెను ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించి, మంచి ఉద్యోగంలో చూడాలనుకున్నాను. అలాగే చూస్తున్నాను. అంతేకానీ, ఆమె అలా కాకుండా హీరోయిన్‌ అయ్యి ఉంటే బాధపడేవాన్ని అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ప్రకారం నటి అన్పించుకోవడం అంత చిన్న విషయమేమీ కాదనీ, అందుకు తన కూతురు అంతగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. వాస్తవానికి హీరోయిన్‌ అంటే ఆయనకున్న అభిప్రాయం ఏదైనా కానీ, ఆయన కూతుర్ని మాత్రం హీరోయిన్‌గా చూడాలనుకోలేదని అర్ధం అవుతోంది.