ENGLISH

Prabhas: ప్రభాస్ సినిమాలో సెన్సేషనల్ స్టార్

03 December 2022-13:53 PM

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్‌. తాత-మనవళ్లుగా రెండు పాత్రల్లోనూ ప్రభాసే నటించనున్నారని సమాచారం.

 

ఇపుడు మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ సంజయ్ దత్ ని సంప్రదించారని తెలుస్తోంది. కేజీఎఫ్ లో విలన్ గా పాన్ ఇండియా ఆకట్టుకున్నారు సంజయ్. ఇప్పుడు అదే మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకొని సంజయ్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది.

ALSO READ: Matti Kusthi Review: 'మ‌ట్టి కుస్తీ' మూవీ రివ్యూ & రేటింగ్!