ENGLISH

పూరి...సంజయ్ ....ఓ 7 సినిమాలు

14 August 2024-15:06 PM

ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమాలకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా యూత్ పూరి సినిమాలకి బాగా కనక్ట్ అవుతారు. మహేష్ కి పోకిరి, బిజినెస్ మెన్. ఎన్టీఆర్ కి టెంపర్, బన్నీ కి దేశముదురు లాంటి హిట్స్ ఇచ్చి హీరోగా వారిని కొత్తగా పరిచయం చేసాడు. విజయ్ దేవర కొండతో వచ్చిన లైగర్ మూవీ ఫ్లాప్ తరవాత పూరి కెరియర్ కొంచెం డౌన్ అయ్యింది. ఈ క్రమంలోనే తనకి సూపర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ ని నమ్ముకుని, డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించాడు. ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి పట్టుదలగా ఉన్నాడు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15 న రిలీజ్ అవుతోంది. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న పూరి షాకింగ్ విషయాన్ని అనౌన్స్ చేసాడు. 


డబుల్ ఇస్మార్ట్ లో విలన్ పాత్ర‌తో సంజయ్ దత్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే KGF సినిమాతో సౌత్ లో అరంగేట్రం చేసిన సంజయ్, తరవాత కోలీవుడ్ లో  విజయ్ నటించిన లియోలో కూడా విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు పూరి సినిమాతో తెలుగులో అడుగుపెడుతున్నాడు. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ లో విలన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్నాడు. తాజాగా ముంబైలో జరిగిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో  సంజ‌య్ దత్ తో క‌లిసి ఏడు ప్రాజెక్టుల‌కు ప‌ని చేస్తున్నామ‌ని పూరి జ‌గ‌న్నాథ్ తెలిపారు.


ఏడు ప్రాజెక్ట్‌ల కోసం సంజూతో కలిసి పనిచేయడానికి సైన్ అప్ చేశామ‌ని పూరి జగన్నాధ్ ముంబై వేదిక‌పై ప్ర‌క‌టించ‌డంతో ద‌త్ రేంజ్ సౌత్ లో అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ ఏడు ప్రాజెక్ట్స్ లో సంజయ్ హీరోగా కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మొత్తానికి కెరియర్ అయిపోయిందన్న టైంలో సంజయ్ పూరి కారణంగా బిజీగా మారిపోయాడు.