ENGLISH

మ‌హేష్ వారి.. రికార్డు పాట‌

25 January 2021-13:20 PM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి రికార్డులు సృష్టించ‌డం, ఆ రికార్డుల్ని బ్రేక్ చేయ‌డం కొత్తేం కాదు. అయితే ఈసారి.. మ‌హేష్ ఫ్యాన్స్ స‌రికొత్త రికార్డు సృష్టించారు. కొంత కాలం నుంచి మహేష్ న‌టిస్తున్న‌ “సర్కారు వారి పాట” సినిమా హాష్ టాగ్ ను ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ట్వీట్స్ తో అదరగొట్టారు. దీంతో ఆ మార్క్ వంద మిలియ‌న్స్ క్రాస్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాకీ ఇలాంటి రికార్డు అంద‌లేదు. ఇదంతా మ‌హేష్ ఫ్యాన్స్ మ‌హిమే. ఈరోజే.. `స‌ర్కారు వారి పాట‌` షూటింగ్ కూడా దుబాయ్‌లో మొద‌లైపోయింది.

 

20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ బ్యాక్‌‌ డ్రాప్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌హేష్ బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా న‌టిస్తాడ‌ని సమాచారం. సినిమా విడుద‌ల అవ్వ‌కుండానే.. రికార్డుల బోణీ కొట్టేసింది. విడుద‌ల‌య్యాక‌.. ఎలాంటి రికార్డులు సొంతం అవుతాయో..?

ALSO READ: అప్పుడు 5 కోట్లు.. ఇప్పుడు 50 కోట్లు