ENGLISH

మ‌హేష్‌ 150 కోట్లు కొట్టాల్సిందే!

09 May 2022-14:12 PM

మ‌రో రెండు రోజుల్లో స‌ర్కారు వారి పాట విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. త‌మ‌న్ పాట‌లు అదిరిపోయాయి. ట్రైల‌ర్ కూడా.. మాస్‌కి బాగా న‌చ్చేసింది. ఫ్యాన్స్ అప్పుడే ఈ సినిమాని పోకిరి, దూకుడు సినిమాల‌తో పోలుస్తున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో కూడా ఈ సినిమాకి పాజిటీవ్ టాకే న‌డుస్తోంది. బిజినెస్ ప‌రంగా చూస్తే... మంచి రేట్ల‌కే ఈ సినిమా అమ్ముడుపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిపి రూ.125 కోట్లు బిజినెస్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల టాక్‌.

 

నైజంలో ఈ సినిమాని రూ.36 కోట్ల‌కు అమ్మారు. సీడెడ్ లో13 కోట్లు ప‌లికింది. వైజాగ్ లో రూ.13 కోట్లు రాబ‌ట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా రూ. 100 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటక 8.5 కోట్లు.. ఓవర్సీస్ 11 కోట్లు జరిగింది. మొత్తానికి రూ.125 కోట్ల లెక్క తేలింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల బాట ప‌ట్టాలంటే.. రూ.150 కోట్లు కొట్టాలి. మ‌హేష్ సినిమాకి అదేం లెక్క కాదు. పైగా.. ఇది స‌మ్మ‌ర్ సీజ‌న్‌. ఈమ‌ధ్య థియేట‌ర్‌కి మంచి సినిమా, అందులోనూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా క‌లిసి చూసే సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. మ‌హేష్ సినిమా అంటే కుటుంబం అంతా క‌లిసొస్తారు. ఈ లెక్క‌ల‌న్నీ వ‌ర్క‌వుట్ అయితే. రూ.150 కోట్లు పెద్ద మేట‌రేం కాదు.

ALSO READ: ట్రైలర్ రివ్యూ : ఎఫ్ 3.. మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్