ENGLISH

మ‌హేష్‌కి ఢీ కొట్టేది అత‌నే!

10 July 2021-10:39 AM

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్ క‌థానాయిక‌. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసంచాలామంది పేర్లు ప‌రిశీలించారు. అర‌వింద్ స్వామి, మాధ‌వ‌న్, ఉపేంద్ర‌... ఇలా ర‌క‌ర‌కాల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ప్ర‌తినాయ‌కుడిగా స‌ముద్ర‌ఖ‌నిని ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

స‌ముద్ర ఖ‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో బ‌న్నీని ఢీకొట్టింది స‌ముద్ర‌ఖ‌నినే. `క్రాక్‌`లో విల‌న్ గా ఆక‌ట్టుకున్నాడు. ఈవారంలోనే.. చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. తాజా షెడ్యూల్ లోనే స‌ముద్ర‌ఖ‌ని ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు పాట‌ల రికార్డింగ్ కూడా పూర్త‌య్యింది. 2022 సంక్రాంతికి ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ALSO READ: ‘లాల్‌సింగ్‌ చద్దా’లో జాయిన్‌ అయిన యంగ్ హీరో నాగచైతన్య