ENGLISH

రాజశేఖర్‌ స్టేటస్‌ ఏంటంటే.?

30 April 2019-11:50 AM

ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మేన్‌గా యాక్షన్‌ హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ని జనం దాదాపు మర్చిపోయిన టైంలో 'గరుడవేగ' సినిమాతో సరికొత్తగా బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. ఇక ఆ జోరును కొనసాగిస్తూ, కొత్త దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో 'కల్కి' సినిమాని ప్లాన్‌ చేశాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన 'కల్కి' ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ రావడంతో రాజశేఖర్‌ పూర్తి నమ్మకంగా ఉన్నాడు ఈ సినిమాపై. 

 

ఇదిలా ఉంటే, రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన మరో సినిమా 'అర్జున' ఎలక్షన్స్‌ ముందు ధియేటర్స్‌లో సందడి చేయాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్‌ టైంలో ఆ సినిమా విడుదలను పోస్ట్‌పోన్‌ చేయాలన్న ఎన్నికల కమీషన్‌ అభ్యంతరంతో 'అర్జున' పోస్ట్‌ పోన్‌ అయ్యింది. 'అర్జున' పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఇక ఎలక్షన్స్‌ ముగిశాయి కాబట్టి, ఈ సినిమా నిర్మాతలు త్వరలోనే 'అర్జున' రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారట. 

 

మరోవైపు 'కల్కి' కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో యాక్టివ్‌ అవ్వడంతో త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌నీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజశేఖర్‌ త్వరలో డబుల్‌ ధమాకా ఇవ్వనున్నాడన్న మాట. తక్కువ గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయనీ తెలుస్తోంది. ఇక 'గరుడవేగ' సక్సెస్‌తో 'కల్కి'పై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగా జరిగిందట. శాటిలైట్‌ రైట్స్‌ ఊహించని స్థాయిలో అమ్ముడుపోయాయట. డిజిటల్‌లోనూ 'కల్కి' దూకుడు ప్రదర్శిస్తోందనీ సమాచారమ్‌. చూడాలి మరి రాజశేఖర్‌ 'కల్కి'తో 'గరుడవేగ' సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడో లేదో.! 

ALSO READ: 'లక్ష్మీబాంబ్‌'గా మారిన 'సీత'.!