నటుడన్నాక ఏదైనా చేయాలి. ఆ విషయంలో రవితేజకి సాటి ఇంకెవరూ రారేమో. అందుకే హీరోగా రవితేజ మాస్‌లో అంత టి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఒక్కోసారి రవితేజ చేష్టలు స్క్రీన్‌పై హద్దులు దాటేస్తుంటాయి. ఉదాహరణకు 'ఆంజనేయుడు' సినిమాలో హీరోయిన్ నయనతారని 'ఎదవ' అని తిట్టడం, హీరోయిన్‌ని అతిగా టీజింగ్ లాంటివన్న మాట.
కానీ అలాంటివి రవితేజకు మాత్రమే చెల్లుతాయనడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. అందుకే 'సిగ్గు లేకుండా నటించడం రవితేజకు మాత్రమే చెల్లింది' అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. నిజానికి సిగ్గు లేకుండా నటించడం అంటే, ఎలాంటి రోల్ అయినా పోషించేందుకు రవితేజ వెనుకాడడు. అంతేకాదు, ఆ రోల్ పోషించడం వెనక రవితేజ తపన, డెడికేషన్ చాలా గొప్పవి అని చెప్పే సందర్భంలో పవన్ కళ్యాణ్ అలా ప్రస్థావించారు. నిజానికి 'ఇడియట్', 'అమ్మ నాన్న తమిళమ్మాయి' వంటి కథలు పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథలు.
వాటిలోకి రవితేజ వచ్చాడు.ఆ కథల్లో కొన్ని సన్నివేశాల విషయంలో పవన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ కథలు రవితేజ చేతికి వెళ్లిపోయాయి. సిగ్గుపడి, కొంచెం మొహమాటపడి పవన్ వదిలేసుకున్న ఆ ప్రాజెక్ట్స్‌తో రవితేజ స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. లేటెస్టుగా రవితేజ 'నేల టికెట్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ఆడియో ఫంక్షన్ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చి, రవితేజ గొప్పతనాన్ని వేదికపై గుర్తు చేశాడు. రవితేజ అంటే తనకెంతో ఇష్టమైన నటుడనీ, తాను హీరో కాకముందే, నటుడిగా రవితేజ అంటే తనకు అభిమానమనీ పవన్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
ALSO READ: దిల్‌రాజు స్కెచ్చేస్తే సక్సెస్ చిక్కాల్సిందే.!