ENGLISH

స్టిల్స్‌తో మనసుదోచేస్తున్న 'మహానుభావుడు'

02 September 2017-19:29 PM

మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న సినిమా 'మహానుభావుడు'. ఈ సినిమా స్టిల్స్‌తోనే సినీ ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంటున్నాడు శర్వానంద్‌. మొన్నామధ్యన విడుదలైన టీజర్‌ బాగా ఎట్రాక్ట్‌ చేసేసింది. 'అతి శుభ్రం' అనే డిజార్డర్‌తో బాధపడ్తుంటాడు ఈ సినిమాలో హీరో. ఇదొక మానసిక సమస్య. దాన్ని ఆధారంగా చేసుకుని బోల్డంత ఫన్‌ జనరేట్‌ చేశారట. శర్వానంద్‌ బాడీలాంగ్వేజ్‌ బాగా ఉపయోగపడింది. డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ పుట్టిస్తున్నాడు ఈ సినిమాలో శర్వానంద్‌. శర్వానంద్‌ సరసన మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరి పెయిర్‌ చూడముచ్చటగా ఉండబోతోందని టీజర్‌ని చూస్తేనే అర్థమవుతోంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ స్టిల్స్‌లో సూపర్బ్‌గా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. కామెడీతో పాటు మాంచి రొమాన్స్‌ కూడా ఉండబోతోందని తెలియ వస్తోంది. 'భలే భలే మగాడివోయ్‌' ఫార్ములానే ఈ సినిమాకీ ఉపయోగించేస్తున్నట్లున్నాడు డైరెక్టర్‌ మారుతి. ఏదేమైనా స్టిల్స్‌తోనే 'మహానుభావుడు' అంచనాల్ని పెంచేసుకోవడం గమనించదగ్గ విషయం. సంక్రాంతికి 'శతమానంభవతి' సినిమాతో పెద్ద సినిమాలతో పోటీ పడి, పెద్ద హిట్‌ అందుకున్న శర్వానంద్‌, దసరాకి పెద్ద సినిమాలతో పోటీ పడుతున్నాడు. బాలయ్య 'స్పైడర్‌', 'జై లవకుశ' సినిమాలతో పోటీ పడి, శర్వానంద్‌ మళ్ళీ పెద్ద విజయం దక్కించుకుంటాడేమో చూడాలిక.

ALSO READ: అర్జున్ రెడ్డి మొదటి వారం ఎంత వసూలు చేసిండో తెలుసా?