ENGLISH

శ‌ర్వాతో.. చ‌ర‌ణ్ బంధుత్వం క‌లుపుకుంటున్నాడా?

02 September 2020-18:00 PM

రామ్ చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్ మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ స్నేహం బంధుత్వంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని టాలీవుడ్ టాక్‌. శ‌ర్వానంద్ కి పెళ్లి కుదిరింద‌ని, ఉపాస‌న ద‌గ్గ‌రి బంధువే.. శ‌ర్వానంద్‌కి కాబోయే శ్రీ‌మతి అని టాలీవుడ్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. త్వ‌ర‌లోనే.. శ‌ర్వానంద్ నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతోంద‌ని కూడా చెప్పుకుంటున్నారు.

టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లో శ‌ర్వా ఒక‌డు. ఈమ‌ధ్య టాలీవుడ్ హీరోల మ‌న‌సు పెళ్లిళ్ల‌పై ప‌డింది. అందులో భాగంగానే శ‌ర్వా కూడా పెళ్లికి రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా శ‌ర్వా ఓ అమ్మాయిని ఇష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. ఇప్పుడు ఇరు కుటుంబాలూ ఈ పెళ్లికి ఓకే అన్నార‌ని తెలుస్తోంది. ఉపాస‌న కూడా శ‌ర్వాకి మంచి ఫ్రెండే. ఇప్పుడు ఉపాస‌న కి వ‌రుస‌కు చెల్లెలు అయిన అమ్మాయినే... శ‌ర్వా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. నిజ‌మో, కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: కృష్ణ‌వంశీతో గొడ‌వ ఎందుకంటే...