ENGLISH

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో శర్వా సినిమా!

26 August 2017-12:38 PM

అర్జున్ రెడ్డి తో తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి. ఈయన దర్శకత్వ ప్రతిభ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.

అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా హీరో శర్వానంద్ ని లీడ్ రోల్ లో అనుకున్నారు, కాని కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇదే విషయమై అర్జున్ రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సందీప్ కూడా చెప్పాడు.

ఇక అర్జున్ రెడ్డి తో కలవలేకపోయిన కాంబినేషన్ మళ్ళీ ఇంకొక చిత్రంతో కలవనుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి తరువాత చిత్రంలో శర్వానంద్ హీరోగా చేయనున్నట్టు తెలుస్తుంది.

దీనితో మొదటి చిత్రంతో చేజారిపోయిన కాంబినేషన్ కలయిక మళ్ళీ స్క్రీన్ పై కనపడనుంది. చూద్దాం.. సందీప్-శర్వాల కాంబినేషన్ ఎలా ఉండబోతుందో..

 

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్