ENGLISH

శ‌ర్వా ఫ్రీగా చేశాడు కాబ‌ట్టి స‌రిపోయింది..!

12 March 2022-11:24 AM

ఈమ‌ధ్య శ‌ర్వానంద్ టైమ్ అస్స‌లు బాలేదు. వ‌రుస‌గా అన్నీ ఫ్లాపులే. ఒక‌దాని త‌ర‌వాత మ‌రోటి.. అలా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లూ` కూడా శ‌ర్వా త‌ల రాత మార్చ‌లేక‌పోయింది. ఈ సినిమాపై పాజిటీవ్ బ‌జ్ ఏర్ప‌డినా, వ‌సూళ్ల‌లో ఆ ప్ర‌భావం ఏమాత్రం క‌నిపించ‌లేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత మాత్రం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డాడు. దానికి కార‌ణం... శ‌ర్వానందే.

 

ఆడ‌వాళ్లు చిత్రానికి సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. ఈ బ్యాన‌ర్‌లో శ‌ర్వా ఇది వ‌ర‌కు `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. మితిమీరిన బ‌డ్జెట్ వ‌ల్ల‌, నిర్మాత న‌ష్టాల్లో కూరుకుపోయాడు. అందుకే ఆ నిర్మాత కోసం శ‌ర్వా `ఆడ‌వాళ్లు..` చేశాడు. ఎలాంటి పారితోషికం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌.. `ఆడ‌వాళ్లు..` చాలా త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్త‌యింది. మంచి బ‌జ్ ఏర్ప‌డ‌డంతో టేబుల్ ప్రాఫిట్ కి సినిమా అమ్మేశారు. అలా నిర్మాత సేఫ్ అయ్యాడు. కానీ ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు మాత్రం న‌ష్ట‌పోయారు. శ‌ర్వా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే నిర్మాత ఈసారి కూడా మునిగిపోయేవాడే.

ALSO READ: రాధేశ్యామ్ మూవీ రివ్యూ & రేటింగ్