ENGLISH

ఆశిష్ శర్వా ని రీప్లేస్ చేయగలడా?

06 March 2024-13:44 PM

2017 సంక్రాంతికి విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌కి  బాగా దగ్గరైన సినిమా  'శతమానం భవతి'. సతీష్ వేగెశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో   శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించారు. దిల్ రాజు నిర్మాత. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటంతో పాటు నేషనల్  అవార్డులు కూడా సాధించింది ఈ మూవీ. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజంట్ టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సందర్భంగా హిట్ అయిన చాలా సినిమాలు సీక్వెల్స్ కి నోచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏడేళ్లు తరవాత  'శతమానం భవతి' కి సీక్వెల్ రాబోతోంది.
       

సాధారణంగా సీక్వెల్స్ లో మొదటి పార్ట్ లో ఉన్నవారే కొనసాగుతారు, ముఖ్యంగా హీరోలు వారే ఉంటారు. కానీ ఈ మూవీ పూర్తిగా కొత్త టీమ్‌తో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల  టాక్ . శర్వానంద్ ని కూడా పక్కన పెట్టి  ఇంకో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.  2025  సంక్రాంతికి ‘శతమానం భవతి నెక్స్ట్ పేజి’ తో రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే రిలీజ్ డేట్ ను కూడా పేర్కొన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.


వంశీ పైడిపల్లి దగ్గర వర్క్ చేసిన హరి 'శతమానం భవతి నెక్స్ట్ పేజీ' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. శర్వానంద్ ప్లేస్ లో దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కొడుకు 'ఆశిష్ రెడ్డి' నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో 'రౌడీ బాయ్స్‌' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి.  నెక్స్ట్ 'లవ్‍ మీ - ఇఫ్ యూ డేర్' అనే రొమాంటిక్ హారర్ మూవీతో వేసవికి రానున్నాడు. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పడు ‘శతమానం భవతి 2’ లో కూడా  ఆశిష్ ఫిక్స్ అయితే కెరియర్ సక్సెస్ అయినట్టే అని అంతా భావిస్తున్నారు.