ENGLISH

శేఖ‌ర్ క‌మ్ముల నెక్ట్స్ హీరో ఎవ‌రు?

30 March 2021-11:00 AM

శేఖ‌ర్ క‌మ్ముల‌.. క్లాస్ డైరెక్ట‌ర్ గా పేరు. యూత్ ఫుల్ సినిమాల్ని సెన్సిటీవ్ గా తీస్తారు. ఆయ‌న సినిమాల‌కు కాసులే కాదు, అవార్డులూ వ‌స్తుంటాయి. అయితే పెద్ద హీరోల‌తో మాత్రం ఆయ‌న జ‌ట్టు క‌ట్ట‌లేదు. అలాంటి అవ‌కాశాలు ఒక‌ట్రెండు సార్లు వ‌చ్చినా, వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని టాలీవుడ్ టాక్‌.

 

ప్ర‌స్తుతం `ల‌వ్ స్టోరీ` ప‌నుల్లో బిజీగా ఉన్నారు శేఖ‌ర్‌. ఈగ్యాప్ లోనే వెంక‌టేష్ కోసం ఓ క‌థ రెడీ చేశార‌ని తెలుస్తోంది. త‌న ద‌గ్గ‌ర ఓ క‌థ ఉన్న‌ట్టు, వెంకీకి స‌మాచారం అందించార‌ని, వెంకీ కూడా `త‌ప్ప‌కుండా చేద్దాం` అని క‌మిట్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఎఫ్ 3, దృశ్య‌మ్ 2 సినిమాల‌తో బిజీగా ఉన్నాడు వెంకీ. అన్నీ కుదిరితే... 2022లో ఈ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చూడొచ్చు.

ALSO READ: నిర్మాత‌పై చీటింగ్ కేసు... వంద కోట్లకు టోక‌రా?