ENGLISH

'సాహో'రే గాల్లో తేలినట్లుందే!

17 August 2017-16:23 PM

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ ప్రబాస్‌ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. 'సాహో' సినిమా కోసం ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారు. ఎంత మందినో పరిశీలించిన పిమ్మట చిట్ట చివరికి శ్రద్దాపూర్‌ని ఎంచుకుంది చిత్ర యూనిట్‌. తెలుగులో నటించే ఛాన్స్‌ వచ్చినందుకు ఈ బ్యూటీ ఆనందంతో ఎగిరి గంతేస్తోందట. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి అంతగా ఆఫర్లు లేవు. అరా కొరా ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఛేంజ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అంటూ అమ్మడు తెలుగులో నటించేందుకు సంతృప్తిగానే ఒప్పుకుందట. అందులోనూ 'బాహుబలి' అయిన ప్రబాస్‌ సరసన అంటే మరీ ముచ్చట పడిపోతోందట. బాలీవుడ్‌లో అమ్మడు నటించిన 'భాఘీ' మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో విలన్‌గా నటించాడు తెలుగు నటుడు సుధీర్‌ బాబు. ఆ కారణంగా ఈ ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. సో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ అంటూ ఆమెకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు హీరో సుధీర్‌బాబు. 'భాఘీ'లో హీరో, విలన్‌తో సమానంగా ఈ ముద్దుగుమ్మ కూడా మార్సల్‌ ఆర్ట్స్‌ ఇరగదీసేసింది. 'సాహో' ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకీ ప్రాధాన్యత ఉంటుందట. అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆరితేరిన శ్రద్ధా కపూర్‌నే ఈ సినిమాకి ఏరి కోరి ఎంచుకుంది చిత్ర యూనిట్‌. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ALSO READ: బాలకృష్ణకి కోపమొచ్చింది