ENGLISH

త‌ల్లి కాబోతున్న స్టార్ సింగ‌ర్‌

04 March 2021-17:33 PM

దేశ వ్యాప్తంగా అత్య‌ధిక ఆద‌ర‌ణ పొందుతున్న గాయ‌ని.. శ్రేయా ఘోష‌ల్‌. ప‌లు భాష‌ల్లో సూప‌ర్ హిట్ గీతాల్ని పాడారామె. ఆమె గానానికి అభిమానులెంద‌రో. ఇప్పుడు త‌న అభిమానుల‌కు ఓ శుభ‌వార్త అందించారు. త్వ‌ర‌లోనే ఆమె తల్లి కాబోతున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌ప‌రిచారు. ``బేబీ శ్రేయాదిత్య కమింగ్‌`` అంటూ ఓ ట్వీట్ చేశారు శ్రేయా.

 

జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని, ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ శ్రేయా ట్వీట్‌ చేశారు. 2015 లో శ్రేయా శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రిదీ ప్రేమ వివాహం. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా దాదాపు అన్ని భాష‌ల్లోనూ పాట‌లు పాడారు శ్రేయా. అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న గాయ‌నీమ‌ణుల్లో ఆమె తొలి వ‌రుస‌లోనే ఉంటారు.

ALSO READ: చిక్కుల్లో ప‌డ్డ నాని సినిమా.. ఆ సీన్ తీసేయాల్సిందే!