ENGLISH

శృతి - మైఖేల్‌ లవ్‌ బ్రేకప్‌.!

26 April 2019-11:30 AM

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తనయ శృతిహాసన్‌ గత కొంతకాలంగా లండన్‌కి చెందిన మైఖేల్‌ కోర్సెల్‌తో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఈ జంట పెళ్లి చేసుకుంటారనుకున్నారు కూడా. సోషల్‌ మీడియా ఇంకాస్త అత్యుత్సాహం చూపి, వీరిద్దరికీ ఆల్రెడీ పెళ్లయిపోయిందట.. అనే గాలి వార్తలు కూడా సర్క్యులేట్‌ చేసేసింది. అయితే వెరీ లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారమ్‌ ప్రకారం వీరిద్దరూ తమ లవ్‌కి బ్రేకప్‌ చెప్పేసుకున్నారట. 

 

ఈ విషయాన్ని మైఖేల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. 'మా ఇద్దరి దారులు వ్యతిరేకంగా ఉన్న కారణంగా పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోతున్నాం. కానీ ఫ్రెండ్స్‌గా ఎప్పుడూ కలిసే ఉంటాం..' అని మైఖేల్‌ పేర్కొన్నాడు. మైఖేల్‌తో బ్రేకప్‌ విషయంపై శృతిహాసన్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత శృతిహాసన్‌ ఈ మధ్యనే కొత్త సినిమాలకు సైన్‌ చేస్తోంది. 

 

 

లేటెస్ట్‌గా తమిళ్‌లో ఓ సినిమాకి శృతి సైన్‌ చేసింది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే తెలుగ ప్రాజెక్టులపై కూడా శృతి క్లారిటీ ఇవ్వనుందట. ఇంతవరకూ పీకల్లోతు ప్రేమలో పర్సనల్‌ లైఫ్‌ని జాలీగా ఎంజాయ్‌ చేసిన శృతిహాసన్‌ ఇకపై కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయనుందన్న మాట.  

ALSO READ: ర‌ష్మిక‌.... ఎంత అడిగితే అంత ఇస్తున్నారు మ‌రి!