ENGLISH

శృతిహాసన్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టింది కానీ.!

29 January 2021-15:00 PM

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మ శృతిహాసన్‌ 'క్రాక్‌' సినిమాతో రీ ఎంట్రీ స్టార్ట్‌ చేసింది. రీ ఎంట్రీలో అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. నిజంగా చెప్పాలంటే, అన్నీ బంపర్‌ ఆఫర్సే కానీ, చిన్న వెలితి. రీ ఎంట్రీలో మొదటి ఛాన్స్‌ అయిన 'క్రాక్‌'తో శృతిహాసన్‌కి పెద్దగా వచ్చిన పేరేమీ లేదు. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో 'వకీల్‌ సాబ్‌'లో నటిస్తోంది. ఆ సినిమాలోనూ శృతి క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ లేదంటున్నారు.

 

జస్ట్‌ గెస్ట్‌ రోల్‌ అది. ఇకపోతే, లేటెస్ట్‌గా ప్రబాస్‌ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. ఇది కూడా శృతిహాసన్‌కి గోల్డెన్‌ ఛాన్స్‌ అనే చెప్పక తప్పదు. 'కేజీఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న 'సలార్‌' మూవీలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ పేరు గత కొంత కాలంగా వినిపిస్తోంది. వెరీ లేటెస్ట్‌గా ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ కన్‌ఫామ్‌ చేసింది. అంతా బాగానే ఉంది కానీ, 'కేజీఎఫ్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీ నిధి శెట్టికి పెద్దగా ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. అలాగే, 'సలార్‌'లోనూ శృతిహాసన్‌ క్యారెక్టర్‌కి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఉండదేమో అంటున్నారు కొందరు.

 

ఏమో, ఏది ఏమైతేనేం, శృతిహాసన్‌కి ఆఫర్స్‌ అయితే, బంపర్‌ రేంజ్‌లో క్యూ కడుతున్నాయి. ఇక స్టార్‌డమ్‌ అంటారా.. సినిమా హిట్‌ అయితే చాలు.. ఆటోమెటిగ్గా, స్టార్‌డమ్‌ దానంతట అదే వచ్చేస్తుంది. మొత్తానికి శృతిహాసన్‌ కెరీర్‌ మునుపటిలా ఎప్పుడు టర్న్‌ అవుతుందా.. అని ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకు ఇది గుడ్‌ న్యూసే మరి.

ALSO READ: Shruti Haasan Latest Photoshoot