ENGLISH

శ్రుతిహాస‌న్ ఇప్పుడైనా దిగి వ‌స్తుందా?

09 April 2021-13:48 PM

వ‌కీల్ సాబ్ పై శ్రుతిహాస‌న్ చాలా ఆశ‌లే పెట్టుకుంది. క్రాక్ త‌ర‌వాత త‌న‌కు పెద్ద హిట్ వ‌స్తుంద‌ని అనుకుంది. అయితే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో శ్రుతి క‌నిపించ‌లేదు. ఇక ముందు వ‌చ్చే అవ‌కాశ‌మూ లేదు. ఈ సినిమా మేకింగ్ స‌మ‌యంలోనే చిత్ర‌బృందంపై అలిగింద‌ని, త‌న పాత్ర నిడివి విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేసింద‌న్న టాక్స్ వినిపించాయి. పైగా ట్రైల‌ర్ లో సైతం శ్రుతి లేదు. అందుకే.. ఈ సినిమాని శ్రుతి వ‌దిలేసింద‌ని చెప్పుకున్నారు.

 

ఇప్పుడు వ‌కీల్ సాబ్ విడుద‌లైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో త‌ను క‌నిపించింది. ఆ ఎపిసోడ్ ఉండేది 10 నిమిషాలే. అందులో శ్రుతికి ఇచ్చిన డైలాగులు నాలుగో.. ఐదో. ఓ ర‌కంగా చెప్పాలంటే ఇది గెస్ట్ రోల్ మాత్ర‌మే. అందుకే శ్రుతి... ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు. హీరోయిన్ గా ఆఫ‌ర్ ఇచ్చి, త‌న‌ని గెస్ట్ రోల్ కే ప‌రిమితం చేసినందుకు ఈ టీమ్ పై శ్రుతి అల‌గ‌డంలో త‌ప్పు లేదు. అయితే ఇప్పుడు వ‌కీల్ సాబ్ కి హిట్ టాక్ వ‌చ్చేసింది. హిట్ సినిమాలో కాసేపు ఉన్నా ఆ మైలేజీ వేరు. కాబ‌ట్టి.. ఇప్పుడైనా శ్రుతి ప్ర‌మోష‌న్ల‌కు వ‌స్తుందేమో చూడాలి.

ALSO READ: 'వకీల్ సాబ్' మూవీ రివ్యూ & రేటింగ్!