ENGLISH

సంగీత దర్శకుడి బండారం బయటపెట్టిన దర్శకుడు

22 February 2024-15:52 PM

అర్జున్ రెడ్డి సినిమాతో సంగీత దర్శకుడు రధన్ పేరు వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సందీప్ వంగా సినిమా విడుదల సమయంలో రధన్ పై చేసిన కామెంట్స్ కూడా వార్తల్లో నిలిచాయి. సినిమాకి చాలా ఇబ్బందులు పెట్టడని, అతని కారణంగానే సినిమా ఆలస్యమైయిందని, బీజీఎం హర్ష వర్ధన్ రామేశ్వర్ తో చేయించుకున్నాని అప్పట్లో సందీప్ చెప్పడం గుర్తుండేవుంటుంది. తాజాగా మరో దర్శకుడు రధన్ బారిన పడ్డాడు. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా పరిచయం అవుతున్నాడు. వి యశస్వీ ఈ సినిమాకి దర్శకత్వం. ఈ సినిమాకి మ్యూజిక్ రధన్.


అయితే  రధన్ తో వర్క్ చేయడం ఎంత నరకంగా వుటుందో స్వయంగా దర్శకుడు సినిమా ప్రీరిలీజ్ వేదికగా చెప్పాడు. ''సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేశాను. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైయింది. దీనికి కారణం రధన్.  అతను మంచి టెక్నిషియన్ కానీ అతని చేతిలో పడితే సినిమానలిగిపోతుంది. రధన్ గొడవ పడటానికే మాట్లాడతాడు. తను చెన్నైలో వుండి బతికిపోయాడు. ఇక్కడవుంటే మాత్రం చాలా గొడవలయ్యేవి. నాలా ఎవరూ మోసపోకూడదనే ఈ విషయాన్ని చెబుతున్నాను'' అంటూ ఓపెన్ గా తను ఎదురుకున్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు యశస్వీ.  టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచింది ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ సినిమా విడుదలకు ముందే సుకుమార్ బ్యానర్ లో ఓ సినిమా అవకాశం అందుకున్నారియన. ఈ శుక్రవారం ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.