ENGLISH

శింబు మ‌న‌సు బంగారం!

09 November 2020-15:00 PM

త‌మిళ‌నాట ఓ వెలుగు వెలిగిన హీరో శింబు. తెలుగులోనూ త‌న సినిమాలు డ‌బ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. న‌య‌న‌తార‌, త్రిష‌ల‌తో శింబు న‌డిపిన ప్రేమాయ‌ణాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే. అయితే కొన్నేళ్లుగా శింబుకి విజ‌యాల్లేవు. యువ హీరోల పోటీలో చ‌తికిల‌ప‌డిపోతున్నాడు. త‌ను హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. క్ర‌మంగా ఫేడ‌వుట్ అవుతున్న హీరోల జాబితాలో తానూ ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైనా ఓ హిట్టు కొట్టి, త‌న ఫామ్ ప్ర‌ద‌ర్శించుకోవాల‌ని భావిస్తున్నాడు. శింబు ఆశ‌ల‌న్నీ ఇప్పుడు `ఈశ్వ‌ర‌న్‌` సినిమాపైనే ఉన్నాయి. సుశీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది.

 

త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్ర యూనిట్‌కి శింబు విలువైన కానుక‌లు పంచాడు. ప్ర‌తి ఒక్క‌రికీ బంగారు నాణెం, కొత్త బ‌ట్ట‌లు, బాణా సంచా కానుక‌లుగా ఇచ్చాడు. సినిమా హిట్ట‌యితే... కానుక‌లు ఇవ్వ‌డం మామూలే. సెట్స్‌పై వుండ‌గానే.. కానుక‌లు పంచిపెట్టాడంటే, శింబుకి ఈసినిమాపై ఎంత న‌మ్మకం ఉందో చూడండి. క‌రోనా సంక్షోభంలో.. సినీ కార్మికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. అలాంటి స‌మ‌యంలో.. శింబు నుంచి ఈ కానుక‌లు రావ‌డం ప‌ట్ల‌.. చిత్ర‌బృందం సంతోషం వ్య‌క్తం చేసింది.

ALSO READ: త‌మ‌న్నా 11వ గంట‌లో ఏం చేసింది?