ENGLISH

Sir Trailer: ట్రైలర్ టాక్ : క్యాలిటీ విద్యపై ‘సార్’ పోరాటం

09 February 2023-09:27 AM

‘’డబ్బు ఎలాగైనా సంపాయించవచ్చు. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాయించిపెడుతుంది’’అంటున్నాడు ధనుష్. ఆయన హీరోగా తెలుగు,తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సార్‌’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ వదిలారు. సార్ విద్యా వ్యవస్థ నేపథ్యంలో వుండే కథని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

 

త్రిపాఠి ఎడ్యుకేషనల్ సంస్థల తరపున కొన్ని గవర్నమెంట్ కాలేజీలని దత్తత తీసుకొని, అక్కడికి ధనుష్ ని ఫ్యాకల్టీగా పంపిస్తారు. అలా ఓ కాలేజ్ కి ఫ్యాకల్టీగా వచ్చిన ధనుస్.. ఎదో మంచి చేయాలని ప్రయత్నిస్తాడు. సముద్రఖని పాత్ర రూపంలో ధనుష్ కి ఎలా ఎలాంటి సవాళ్ళు ఎదురౌతాయి. ఈ నేపధ్యంలో వచ్చిన యాక్ష్న్ ఎపిసోడ్ లు ఆకట్టుకునేలా వున్నాయి.

 

‘’ఎడ్యుకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు.’’ అని సముద్రఖని చెప్పిన డైలాగ్ తో ఈ సినిమాతో దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ అర్ధమౌతుంది. డబ్బు ఎలాగైనా సంపాయించవచ్చు. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాయించిపెడుతుంది’’ అని చివర్లో ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది . నాన్ ప్రాఫిటబుల్ సర్విస్ అయిన చదువుని ఈ దేశంలో లాభాల కోసం ఎలా అడ్డదారులు తొక్కించారనే పాయింట్ పై సార్ తెరకెక్కించారని ట్రైలర్ బట్టి అర్ధమౌతుంది.