ENGLISH

'సీతారామం' మరో 'ప్రేమ'మయం

02 August 2022-17:34 PM

2022కి బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ 'సీతారామం'కు వెళ్ళిపోవడం ఖాయమనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ నిర్మిస్తున్న 'సీతారామం' చిత్ర పాటలు సూపర్ హిట్స్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన సీతారామం ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఓ సీతా, ఇంతందం, కానున్న కళ్యాణం ఈ మూడు పాటలు మోలోడీ హిట్స్ గా నిలిచాయి. 

 

తాజాగా నాలుగో పాట 'ఓ ప్రేమ' లిరికల్ వీడియోని విడుదల చేశారు. మరో హార్ట్ టచ్చింగ్ లవ్ మెలోడీ ఇది. ఈ పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆహ్లాదంగా వుంది. 

వస్తా నే వెంటనే..  

ఉంటా నీ వెంటనే.. 

ముద్దంటిన చెంపపై 

తడి ఆరనేలేదులే 

మాటొకటి చెప్పేంతలో 

పయనాలు మొదలాయనే 

ఓ ప్రేమ..  

పల్లవిలో వినిపించిన ఈ మాటలు ప్రేమ కథలో డెప్త్ ని సూచిస్తున్నాయి. పాటని కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఆలపించిన తీరు కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మరో రెండు పాటలు కూడా వున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినిపించే అవకాశం వుంది. ఆగస్ట్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: తెలుగు సూప‌ర్ మ్యాన్‌... బింబిసార‌!