ENGLISH

సోహెల్‌, అరియానా.. బిగ్‌బాస్‌కి 'ఊపు' తెచ్చారోచ్‌.!

11 December 2020-18:00 PM

చాలా డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌ ఒక్కసారిగా అనూహ్యమైన టర్న్‌ తీసుకుంది. హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్‌ మధ్య గొడవ అనూహ్యంగానే మంచి రేటింగుల్ని రాబట్టేస్తోంది. టెలికాస్ట్‌ టైమింగ్‌ మారిన తర్వాత, షో పట్ల ఎవరికీ పెద్దగా ఆసక్తి వుండదని అంతా అనుకున్నారు. అయితే, సోహెల్‌ - అరియానా మధ్య గొడవతో సీన్‌ మారింది. ఆ గొడవని సృష్టించింది బిగ్‌బాస్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంది.? హౌస్‌లో ఏదీ బిగ్‌బాస్‌ అనుమతి లేకుండా జరగదు.

 

పేరుకే రియాల్టీ షోగానీ, ఇక్కడంతా స్క్రిప్ట్‌ ప్రకారమే కథ నడుస్తోంది. అది అర్థం కాక, కంటెస్టెంట్స్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని, కొందరు నెటిజన్లు అడ్డగోలు యాగీ చేస్తుంటారు సోషల్‌ మీడియాలో. సోహెల్‌ - అరియానా మధ్య గొడవ తర్వాత, సోషల్‌ మీడియా అంతా ఏకపక్షంగానే కనిపిస్తోంది. సోహెల్‌ని బూతులు తిట్టేస్తున్నారు.. అరియానా పట్ల విపరీతమైన సింపతీ క్రియేట్‌ అవుతోంది. ఎలాగైతేనేం, అనూహ్యంగా వచ్చిన జోష్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఖుషీగానే వున్నట్లు కనిపిస్తోంది.

 

ముందు ముందు ఇంకా రసవత్తరమైన కథ వుంది.. అంటూ బిగ్‌బాస్‌ విషయమై బోల్డన్ని లీకులు బయటకు వస్తున్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవబోతున్నారు.? అన్న చర్చ కంటే, ఈ రోజు ఏం గొడవ జరుగుతుందో.. అన్న సస్పెన్సే జనాలకి ఎక్కువగా కనిపిస్తోంది. పడిపోయిన రేటింగ్‌ ఒక్కసారిగా పెరుగుతోందంటే, దానిక్కారణం గొడవే. గొడవల్లో వుండే ఆ కిక్కే వేరప్పా.!

ALSO READ: నానితో సాయి ప‌ల్ల‌వి గొడ‌వ ఏమైంది?