ENGLISH

సోలో బ‌తుకే... తొలి రోజు వ‌సూళ్లెంత‌?

26 December 2020-11:26 AM

దాదాపు 9 నెల‌ల త‌ర‌వాత‌.. వెండి తెర‌పై కొత్త సినిమా బొమ్మ ప‌డింది. అదే ... సోలో బ‌తుకే సో బెట‌రు. సాయిధ‌ర‌మ్ తేజ్‌, న‌భా న‌టేషా జంట‌గా న‌టించిన సినిమా ఇది. సుబ్బు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చింది. సినిమా సో..సో గా ఉంద‌ని, ఇంకొంచెం బెట‌ర్ గా తీయొచ్చ‌న్న కామెంట్లు వినిపించాయి. అయినా స‌రే, తొలి రోజు మంచి వ‌సూళ్ల‌ని సాధించింది. దాదాపు కోటి రూపాయ‌లు తెచ్చుకుంది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, డివైడ్ టాక్ వ‌చ్చినా, క‌రోనా భ‌యాలున్నా.. ఈ స్థాయిలో వ‌సూళ్లు తెచ్చుకోవ‌డం గ్రేటే. శ‌ని, ఆది వారాలు సైతం... ఈ సినిమాకి కలిసొచ్చే అవ‌కాశాలున్నాయి.


వ‌సూళ్ల వివ‌రాలిలివి.


నైజాం - 30.75 ల‌క్ష‌లు
విశాఖ - 11.5 ల‌క్ష‌లు
గుంటూరు - 8.06 ల‌క్ష‌లు
కృష్ణా - 5.11 ల‌క్ష‌లు
ఈస్ట్ -7.4 ల‌క్ష‌లు
నెల్లూరు - 5.03 ల‌క్ష‌లు
సీడెడ్ - 17.74 ల‌క్ష‌లు
వెస్ట్‌ - 6.14 ల‌క్ష‌లు
మొత్తం = 9.137 ల‌క్ష‌లు

ALSO READ: ఆ సినిమా ఫ్లాప్ అయ్యింద‌ని ఏడ్చేసిన చిరు