ENGLISH

సోలో బ‌తుకే.. ఫైన‌ల్ రిపోర్ట్ ఏమిటి?

03 February 2021-17:10 PM

లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌లైన పెద్ద సినిమా `సోలో బ‌తుకే సో బెట‌రు`. అప్ప‌టి నిబంధ‌న‌ల కార‌ణం గా 50 శాతం ఆక్యుపెన్సీతో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. చాలా రోజుల త‌ర‌వాత‌.. థియేట‌ర్లు తెర‌వ‌డం, అందులోనూ సాయిధ‌ర‌మ్ లాంటి యూత్ హీరో సినిమా రావ‌డంతో - ప్రేక్ష‌కులు ఉత్సాహాన్ని చూపించారు. టాక్ కాస్త డివైడ్ గా వ‌చ్చినా, వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగానే ల‌భించాయి. దాంతో.. మొద‌ట్లో యావ‌రేజ్ అన్నా, చివ‌రికి హిట్ రిజ‌ల్ట్ తెచ్చుకుంది.

 

మొత్తానికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర 12 కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగింది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బ‌య్య‌ర్లకు పెట్టుబ‌డి తిరిగి వ‌చ్చేసింది. స్వ‌ల్ప లాభాల్నీ తెచ్చుకోగ‌లిగారు. శాటిలైట్, డిజిట‌ల్ రూపంలో మ‌రో 10 కోట్లు వ‌చ్చాయి. దాంతో నిర్మాత కూడా లాభాలు తెచ్చుకున్నాడు. చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే త‌ర‌వాత‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ నుంచి వ‌చ్చిన సినిమా ఇది. కాబ‌ట్టి కుర్రాడు హ్యాట్రిక్ కొట్టేశాడ‌నుకోవొచ్చు. త‌ను న‌టించిన `రిప‌బ్లిక్‌` ఈ వేస‌విలో విడుద‌ల కానుంది.

ALSO READ: చిరు సినిమాకి నో చెప్పిన న‌య‌న‌తార‌?