ENGLISH

రెబల్‌ స్టార్‌ కూతురి 'రెబల్‌' డిమాండ్‌

10 April 2017-17:08 PM

రెబల్‌ స్టార్‌ టాలీవుడ్‌కే కాదు, బాలీవుడ్‌కీ ఉన్నాడు. ఆయనే శతృఘన్‌ సిన్హా. 'షాట్‌ గన్‌' అనీ రెబల్‌ స్టార్‌ అనీ ఆయన్ని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ రెబల్‌ స్టార్‌ కుమార్తే సోనాక్షి సిన్హా. 'దబాంగ్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకే ఎక్కువగా ఓటేస్తోంది. 'అకీరా' సినిమా కోసం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసేసింది. 'నూర్‌' అనే సినిమాలో జర్నలిస్ట్‌గా నటించింది. ఈ బ్యూటీ ఓ రెబల్‌ డిమాండ్‌ని తెరపైకి తెచ్చింది. అదేమిటంటే హీరోలతో సమానంగా హీరోయిన్లకి కూడా పారితోషికం, గుర్తింపు కావాలట. ఆమె డిమాండ్‌లో తప్పు లేదు. హీరోయిన్లను పెట్టి పూర్తిగా సినిమా తీస్తున్నప్పుడు, హీరోకి ఇవ్వాల్సినదానికంటే ఎక్కువగానే ఇవ్వాలి. ఓ పెద్ద హీరో నటించే సినిమాలో హీరోయిన్‌కి కూడా రెమ్యునరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అదే హీరో లేకుండా, హీరోయిన్‌తో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆ మొత్తం రెమ్యునరేషన్‌ ఆమెకే ఇవ్వాలి కదా. అలా మొత్తం కూడా అడగడంలేదు సోనాక్షి, తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఆశిస్తోంది. అయితే హీరోల సినిమాలకున్న డిమాండ్‌ హీరోయిన్లకు ఉండదు. బాక్సాఫీస్‌ లెక్కలు, కమర్షియల్‌ స్టామినా ఇవన్నీ అంచనాలేసుకునే ఇస్తారని సినీ పండితులు అంటున్నారు.

ALSO READ: ప‌వ‌న్ టైటిల్ ఇదేనా?