ENGLISH

రాజ‌కీయాల్లోకి సోనూసూద్‌ సోద‌రి.. ఆ త‌ర‌వాత సోనూనేనా?

15 November 2021-14:18 PM

సోనూసూద్. కొంత‌కాలంగా ఈ పేరు మార్మోగిపోతోంది. సామాజిక సేవే ధ్యేయంగా... ప్ర‌యాణం సాగిస్తున్నాడు ఈ న‌టుడు.క‌రోనా స‌మ‌యంలో సోనూ చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌కు అంతే లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఏదో ఓ రూపంలో త‌న సేవ‌ల్ని విస్త‌రిస్తూనేఉన్నాడు. ఈ హంగామా అంతా చూసి `సోనూ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా`అంటూ ప్రశ్నించారంతా. కానీ సోనూమాత్రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశ్యం లేద‌ని చాలాసార్లు స్ప‌ష్టం చేశాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ చెల్లెలు మాళ‌విక సూద్ స‌చార్ రాజ‌కీయాల్లోకి రానున్నారు.

 

సోనూసూద్‌ తన సోదరితో కలిసి పంజాబ్‌లోని మోగాలో ఓ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాళ‌విక రాజ‌కీయ అరంగేట్రం విష‌యంలో కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోనూ తెలిపారు. ఆమె ఏ పార్టీలో చేరేది సమయం వచ్చినప్పుడు చెబుతామని ప్రకటించారు. అయితే త‌న‌కు మాత్రం రాజ‌కీయాల్లో వ‌చ్చే ఉద్దేశం లేద‌ని సోనూ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మాళవిక.. మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ: చిరు, స‌ల్మాన్ స్టెప్పేస్తే..?